NTV Telugu Site icon

Pataan: నిజం రంగు చూపిస్తున్న దీపిక పదుకొణే

Pataan

Pataan

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అయిదేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 50వ సినిమా రూపొందిన ఈ మూవీని ‘సిద్దార్థ్ ఆనంద్’ డైరెక్ట్ చేస్తుండగా ‘దీపిక పదుకొణే’ హీరోయిన్ గా నటిస్తోంది. హై వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘పఠాన్’ మూవీలో షారుఖ్ కి విలన్ గా ‘జాన్ అబ్రహం’ నటిస్తున్నాడు. బాలీవుడ్ సినీ అభిమానులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ గా రిలీజ్ అవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ‘బేషరం’ అనే సాంగ్ ని విడుదల చేశారు. దీపిక బికినీ అందాలు, షారుఖ్ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సాంగ్ కి హైలైట్ గా నిలిచాయి. విశాల్, శేఖర్ సూపర్బ్ ట్యూన్ ‘బేషరం’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యేలా చేసింది.

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవనున్న ‘పఠాన్’ మూవీ సౌత్ ప్రమోషన్స్ ని కూడా మొదలుపెడుతూ, ‘బేషరం’ హిందీ వెర్షన్ తో పాటు తమిళ, తెలుగు వెర్షన్స్ కి కూడా ఒకేసారి విడుదల చేశారు. తెలుగులో ‘నా నిజం రంగు’ అనే లిరిక్స్ తో స్టార్ట్ అయిన ఈ పాటని ‘శిల్పా రావు’, ‘విశాల్’, ‘శేఖర్’లు పాడారు. నార్త్ తో పాటు సౌత్ ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో సాలిడ్ హిట్ కొట్టి బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేస్తాడని ట్రేడ్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. పైగా ‘పఠాన్’ సినిమాలో ‘టైగర్’ సల్మాన్ ఖాన్ కూడా క్యామియో రోల్ ప్లే చేస్తుండడంతో, ఈ మూవీ గ్యారెంటీగా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ లో అందరూ ఉన్నారు. మరి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న షారుఖ్ ‘పఠాన్’ మూవీతో పాన్ ఇండియా హిట్ కొడతాదేమో చూడాలి.