Mythri Movies has bought Hanuman Nizam rights for an whopping price: కుర్ర హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా నైజాం హక్కులను మైత్రీ మూవీస్ అ సాధారణ ధరకు కొనుగోలు చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ జనవరి 12, 2024న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అనూహ్యంగా అంచనాలు ఏర్పడేలా చేసుకుంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ ముందే ఉత్కంఠను సృష్టించగా ఈ మధ్య రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ఇప్పుడు అదే హనుమాన్ నైజాం హక్కులను మైత్రీ మూవీస్ అసాధారణ ధరకు కొనుగోలు చేసేలా చేసిందని అంటున్నారు. అయితే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హనుమాన్ బిజినెస్ ఓ మీడియం స్టార్ హీరో సినిమా బిజినెస్ కు సమానంగా జరగడం.
Captain Vijayakanth: కెప్టెన్ విజయ్ కాంత్ హత్య.. దర్శకుడి సంచలన ఆరోపణలు?
తాజాగా అందుతున్న సమాచారం మేరకు మైత్రీ మూవీస్ ఈ సినిమా హక్కులను 7.2 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రచార కంటెంట్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం కలిపి 23 కోట్ల బిజినెస్ చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమృత అయ్యర్ కథానాయికగా వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తుండగా, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా, హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సాయిబాబు తలారి ఎడిటర్. జనవరి 12న సంక్రాంతికి తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.