NTV Telugu Site icon

Waltair Veerayya: ఆ తప్పు రిపీట్ చెయ్యకూడదనే మైత్రీ ఆ నిర్ణయం తీసుకుందా?

Waltair Veerayya

Waltair Veerayya

ఏదైనా సాంగ్ ని కానీ వేరే ప్రమోషనల్ కంటెంట్ ని కానీ రిలీజ్ చెయ్యాలి అంటే మేకర్స్ ముందే ఒక డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి పలానా రోజు, పలానా సమయంలో మా ప్రమోషనల్ కంటెంట్ వస్తుంది అంటూ అనౌన్స్ చేస్తారు. సినిమాని నిర్మించే ప్రతి ప్రొడక్షన్ హౌజ్ ఫాలో అయ్యే ఈ రూట్ ని బ్రేక్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’ బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని విడుదల చేస్తున్న మేకర్స్, ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ ని ఈరోజు రిలీజ్ చెయ్యనున్నారు. డిసెంబర్ 26న ‘వీరయ్య’ సాంగ్ ని రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ ఏ టైంకి అనేది మాత్రం చెప్పలేదు. ఈరోజు సాయంత్రం 6:03 నిమిషాల నుండి 8:01 నిమిషాల మధ్యలో ‘వీరయ్య’ సాంగ్ వస్తుంది అంటే మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఒక టైం ఫిక్స్ చెయ్యకుండా ఇలా రెండు గంటల గ్యాప్ లో పాటని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎందుకు చెప్పారో మెగా అభిమానులకి అర్ధం కావట్లేదు.

‘వీరయ్య టైటిల్ సాంగ్’ కన్నా ముందే మైత్రీ మూవీ మేకర్స్ ఇటివలే ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవిని అవుతా’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. చిరు, శృతి హాసన్ ల పైన రూపొందించిన ఈ సాంగ్ ని మేకర్స్ ముందుగా చెప్పిన సమయానికి రిలీజ్ చెయ్యలేకపోయారు. టెక్నికల్ ఇష్యూ కారణంగా ‘నువ్వు శ్రీదేవి అయితే…’ సాంగ్ కొంచెం ఆలస్యంగా బయటకి వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఒక సాంగ్ ని కూడా టైంకి రిలీజ్ చెయ్యలేరా అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పై కామెంట్స్ చేశారు. ఈసారి అలాంటి తప్పు జరగకూడదు అనే మైత్రీ మూవీ మేకర్స్, ‘వీరయ్య టైటిల్ సాంగ్’ రిలీజ్ విషయంలో పర్టికులర్ గా ఒక టైంని చెప్పకుండా ఇలా సాయంత్రం 6:03 నిమిషాల నుండి 8:01 నిమిషాల మధ్యలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినట్లు ఉన్నారు.