NTV Telugu Site icon

Mythri Movie Distributors : ఒకే వారం.. మూడు సినిమాలు

Mythri

Mythri

Mythri Movie Distributors Distributing Three Movies in a Week: గత ఏడాది తాము చేసిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు వరుస సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో దూసుకుపోతోంది. ఒకపక్క డబ్బింగ్ సినిమాలు మరో పక్క స్ట్రైట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ఫీట్ కు చేరువైంది. అదేంటంటే ఈ వారం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి డబ్బింగ్ సినిమా మూడు స్ట్రైట్ సినిమాలు. వీటిలో ఒక డబ్బింగ్ సినిమాతో పాటు రెండు స్ట్రైట్ సినిమాలను నేరుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ముందుగా టోవినో థామస్ హీరోగా నటించిన ఏ ఆర్ ఎం సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు వర్షన్ ని ప్రపంచ వ్యాప్తంగా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.

GOAT Vijay: తెలుగు ‘గోట్’కి భారీ దెబ్బే.. కానీ?

దాంతోపాటు కీరవాణి కొడుకు హీరోగా నటించిన మత్తు వదలరా 2 సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అనుబంధంగా ఉండే క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిచినది. కాబట్టి ఈ సినిమాని కూడా మైత్రి డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమాతో పాటు దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరో చేసిన ఉత్సవం సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది కన్నడలో క్రేజీ బాయ్ అనే సినిమా చేసిన దిలీప్ ప్రకాష్ చాలా గ్యాప్ తీసుకుని తెలుగులో ఈ ఉత్సవం సినిమా చేశాడు. రెజీనాతో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లాంటి స్టార్ ప్యాడింగ్ ఉన్న ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న భలే ఉన్నాడే సినిమా కూడా ఇదే వారం రిలీజ్ అవుతుంది.. కానీ ఒకే వారం రెండు తెలుగు స్ట్రైట్ సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ చేస్తున్న రికార్డు మాత్రం మైత్రీకే దక్కుతుందని చెప్పొచ్చు.

Show comments