Site icon NTV Telugu

“పుష్ప” వీడియో లీక్… పోలీసులను ఆశ్రయించిన మైత్రి నిర్మాతలు

Mythri Approaches Cyber crime on SVP and Pushpa Leaks

నిర్మాణంలో ఉన్న అల్లు అర్జున్‌, మహేష్ బాబు లకు చెందిన చిత్రాల కంటెట్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం కలకలం రేపుతోంది. మహేష్ బాబుతో “సర్కారు వారి పాట”, అల్లు అర్జున్ తో “పుష్ప” చిత్రాలను ఏకకాలంలో నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ రెండు చిత్రాల కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం పట్ల మైతీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేష్ టీజర్, అల్లు అర్జున ఒక పాట అధికారిక విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో మేకర్స్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. “పుష్ప” నుండి “దాక్కో దాక్కో మేక” తెలుగు వెర్షన్ షెడ్యూల్ విడుదల తేదీకి ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. లీకులు తమను కలవర పెట్టాయని చెప్పారు.

Read Also : “అల వైకుంఠపురంలో” దారిలో “భీమ్లా నాయక్” !

“ఇటీవల మా మూవీ మెటీరియల్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంతో మేము చాలా ఆందోళన చెందాము. మేము దీనిని ఖండిస్తున్నాము. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో దీనిపై ఫిర్యాదు చేశాము. త్వరలోనే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు” అంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన “పుష్ప” రెండు భాగాలుగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న మొదటి భాగం “పుష్ప : ది రైజ్” ఈ క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. మరోవైపు మహేష్ బాబు “సర్కార్ వారి పాట” టీజర్ మహేష్ పుట్టిన రోజున విడుదలైంది. “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” పేరుతో విడుదలైన ఈ టీజర్ భారీ సంచలనాన్ని సృష్టించింది.

Exit mobile version