నివాస్ శిష్ఠ్, సారా ఆచార్ జంటగా నటిస్తున్న సినిమా ‘రహస్య’. శివశ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి ఎస్. దీనిని నిర్మిస్తున్నారు. చరణ్ అర్జున్ స్వరాలు సమకూర్చుతుండగా, ఈ డిఫరెంట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఎస్.ఎస్. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మంచానికి, మనిషికి ఉండే సంబంధాన్ని డిఫరెంట్ వే లో చూపించబోతున్నామని దర్శకుడు శివశ్రీ మీగడ తెలిపారు. కంటెంట్ బేస్డ్ గా ఈ కథను రాసుకున్నామని, దానికి తగ్గట్టు గానే లొకేషన్స్ ను ఎంపిక చేసి షూటింగ్ చేశామని, తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకులు చెబుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. బుగతా సత్యనారాయణ, గెద్ద వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, రాజేశ్వరి తదితరులు ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
