Site icon NTV Telugu

Samantha: నా మొదటి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకం : సమంత

Untitled Design (49)

Untitled Design (49)

సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో తనకు కావలసినంత స్టార్ డమ్‌ను తాను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ వంటి ఇండస్ట్రీ లో నటించి తన కంటూ తిరుగులేని ఫ్యాన్స్ బేస్ ఏర్పర్చుకుంది. ఇక ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలల పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న సామ్ తిరిగి కెరీర్ మొదలు పెట్టింది.కానీ ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా ఎక్కువ తన పర్సనల్ లైఫ్ ద్వారా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Also Read:Pooja Hegde : ‘కాంచన 4’ లో పూజా హెగ్డే ఛాలెంజింగ్ రోల్..!

ప్రస్తుతం సమంత నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘మా ఇంటి బంగారం’ ఒకటి.ఈ సినిమాలో ఆమె నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా మరోపక్క ఈ సినిమానే కాకుండా, ప్రముఖ దర్శకులు రాజ్-డీకే తెరకెక్కిస్తున్న ‘రక్త బ్రహ్మాండం’ వెబ్ సిరీస్‌లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘సినిమాలు నా మొదటి ప్రేమ. నేను ఇకపై నటనకు దూరంగా ఉండలేను. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చాను. తిరిగి మీ సామ్ మీ ముందుకు వరుస చిత్రాలతో వస్తుంది’ అంటూ భావోద్వేగంగా తెలిపింది. ఈ మాటలకు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. మేము కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version