Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Isaignani Ilaiyaraaja: భారతీయ సంగీత ప్రపంచంలో దశాబ్దాలుగా స్వరాల సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతిగా వెలుగొందుతున్న ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా నేడు తన 83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నిజానికి ఆయన పుట్టినరోజు జూన్ 3 అయినప్పటికీ, తమిళనాడు దివంగత నేత ఎం.కరుణానిధి గారి జయంతి కూడా అదే రోజు కావడంతో… ఆయనపై ఉన్న గౌరవార్థం ఒక రోజు ముందే (జూన్ 2న) ఇళయరాజా తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఒక అరుదైన విశేషం. మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ దిగ్గజాలు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
అప్రతిహత ప్రస్థానం.. అవార్డుల హారం!
సంగీతమే శ్వాసగా సాగిన ఇళయరాజా కెరీర్లో ఇప్పటివరకు ఏకంగా 8,600 కి పైగా పాటలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా భారతీయ సినిమా సంగీత గమనాన్ని మార్చిన ఘనత ఆయనది. సంగీత ప్రపంచంలో ఆయన చేసిన అసమాన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ తో సత్కరించింది. అలాగే ఆయన ప్రతిభకు గుర్తింపుగా 5 జాతీయ అవార్డులు వరించాయి. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని ఇళయరాజా నిరూపిస్తున్నారు. 83 ఏళ్ల వయసులోనూ ఆయన అదే ఉత్సాహంతో సరికొత్త ట్యూన్స్‌తో దూసుకుపోతున్నారు. నేటి తరం యువ దర్శకుల మేకింగ్ స్టైల్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ అందిస్తూ సినిమా లవర్స్‌ను అలరిస్తున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇళయరాజా జన్మదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వారితో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ నేత కె.అన్నామలై తదితర రాజకీయ ప్రముఖులు ఇసైజ్ఞాని అద్భుత సంగీత ప్రస్థానాన్ని కొనియాడారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి ఇళయరాజా మ్యూజిక్‌తో తమ కెరీర్లో ఎన్నో క్లాసిక్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఆయనకు హృదయపూర్వక బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం ఇళయరాజా లెగసీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వీరితో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ నటీనటులు, టెక్నీషియన్స్ మాస్ట్రోకు నీరాజనాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే, మ్యూజిక్ లవర్స్ కోసం ఆయన ఒక క్రేజీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. రాబోయే ఆగస్టు నెలలో చెన్నై వేదికగా ఒక గ్రాండ్ ‘సింఫనీ’ (Symphony) కన్సర్ట్ను నిర్వహించడానికి ఇళయరాజా సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!