Site icon NTV Telugu

AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Aa2a6

Aa2a6

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా వస్తున్నా సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పాడుకొనే,  మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Also Read : Tollywood : జులై 11న పెద్ద సినిమాకు పోటీగా చిన్న సినిమా

కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే క్యూరియాసిటీ నెలకొంది. అనిరుధ్, సాయి అబ్యాంకర్ వీరి ఇద్దరు పేర్లు గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి. కానీ ఎవరిని లాక్ చేయలేదు మేకర్స్. ఇప్పుడు అందుతున్న విస్వసనీయ సమాచారం ప్రకారం అల్లు అర్జున్, అట్లీ సినిమాకు కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ను ఫిక్స్ చేసారని తెలిసింది. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించబోతున్నారట మేకర్స్. కోలీవుడ్ లో ఇప్పుడు సాయి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే సూర్య నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం కరుప్పు తో పాటు లోకేష్ కనగరాజ్ నిర్మిస్తున్న బెంజ్, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు అల్లుఅర్జున్ – అట్లీ కాంబోకు కు కూడా ఈ యువ సంచలం మ్యూజిక్ ఇస్తుండడం మనోడి క్రేజ్ ఎలా ఉందొ తెలుస్తోంది. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ టేకప్ చేసిన ఈ యంగ్ స్టార్ ఎటువంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version