NTV Telugu Site icon

Shiva Karthikeyan: శివ కార్తికేయన్ వెన్నుపోటు పొడిచాడు… మ్యూజిక్ డైరెక్టర్ సంచలన కామెంట్స్

Shiva Karthikeyan

Shiva Karthikeyan

తెలుగులో నానికి ఎంత పేరుందో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ కి అంతే పేరుంది. ఫ్యామిలీ, యూత్, కిడ్స్… ఈ మూడు వర్గాల్లో శివ కార్తికేయన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక యాంకర్ పొజిషన్ నుంచి స్టార్ హీరో అయ్యే వరకూ వచ్చిన శివ కార్తికేయన్ నుంచి సినిమా వస్తుంది అంటే అది దాదాపు హిట్ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అంత కన్సిస్టెంట్ గా సినిమాలు చేసే శివ కార్తికేయన్ చాలా మంచోడు, నిదానస్తుడు అనే మంచి పేరు కూడా ఉంది. అయితే లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్… శివ కార్తికేయన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచనలంగా మారాయి.

శివ కార్తికేయన్ కెరీర్ బిగినింగ్ నుంచి ఇమ్మాన్ మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు. చాలా కోజ్ ఫ్రెండ్స్ అయిన ఇమ్మాన్, శివ కార్తికేయన్ కలిసి… మనం కోఠి పార్వై, వర్తపడాద వాలిబర్ సంగం, రజినిమురుగన్, సీమరాజా, నమ్మ వేటు పిళ్ళై సినిమాలు వచ్చాయి. ఇందులో చార్ట్ బస్టర్ హిట్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. అలాంటి మోస్ట్ సక్సస్ ఫుల్ కాంబినేషన్ గత కొన్ని రోజులుగా కలిసి వర్క్ చెయ్యట్లేదు. శివ కార్తికేయన్ ఎక్కువగా అనిరుధ్ తో ట్రావెల్ అవుతున్నాడు. ఈ మధ్య వచ్చిన శివ కార్తికేయన్ సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

అసలు ఇమ్మాన్, శివ కార్తికేయన్ కలిసి సినిమా ఎందుకు చెయ్యట్లేదు అనే డౌట్ చాలా మంది మ్యూజిక్ లవర్స్ లో ఉంది. ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ ఇమ్మాన్ ఓపెన్ అప్ అయ్యాడు. “శివ కార్తికేయన్ నాకు ద్రోహం చేసాడు, అతను ఏం చేసాడో తెలుసుకునే సరికే ఆలస్యం అయ్యింది. ఏమి జరిగిందో నేను గ్రహించే సమయానికి, అంతా అయిపొయింది. అందుకే, నేను అతనితో కలిసి పని చేయను. వచ్చే జన్మలో కూడా శివ కార్తికేయన్ హీరోగా… నేను మ్యూజిక్ డైరెక్టర్ గా పుడితే అప్పుడు కలిసి పని చేస్తామేమో కానీ ఈ జన్మలో మాత్రం కలిసి పని చేయడం జరగదు” అంటూ ఇమ్మాన్ ఒక యుట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇమ్మాన్ ఎందుకు అలా మాట్లాడాడు, శివ కార్తికేయన్ ఏం చేసాడు అనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. మరి ఈ విషయంలో శివ కార్తికేయన్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

Show comments