Murali Sharma Wife Ashwini kalsekhar: నటుడు మురళీ శర్మ అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో? తెలుగు వాడే అయినా వేరే రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన ఆయనకి తెలుగు చిత్ర సీమలో ఎంతో పేరు ఉంది. అతిథి సినిమా నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీ శర్మ తెలుగులో విలన్ గా అనేక సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మామయ్య పాత్రలు, తండ్రి పాత్రలతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఒకరకంగా సంపాదించుకున్నారు. సహజ నటనతో ఆయన ఎంతో పేరు గడించారనే చెప్పాలి. అయితే విలన్ గా, కామెడీ విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర అయినా చేయగలిగిన మురళీశర్మ టాలీవుడ్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిధి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తరువాత ఆయన అనేక సినిమాలు చేస్తూ తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. కొన్ని సినిమాల్లో ఆయన పాత్రలు కనుక మనం చూస్తే ఆ సినిమాలోని పాత్ర మురళి శర్మ తప్ప మరొకరు చేయరేమో అనేంతలా ఆయన తన మార్క్ వేసుకున్నారు. అయితే నిజానికి ఆయన మాత్రమే కాదు ఆయన భార్య కూడా మంచి ఆర్టిస్ట్ మురళీ శర్మ భార్య పేరు అశ్విని కాలశేఖర్ ఆమె హిందీలో ఒక బిజీ ఆర్టిస్ట్.
RGV: ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెంచుతున్న ఆర్జీవీ
ఒకప్పుడు తెలుగు వారందరూ విపరీతంగా చూసిన సీఐడీ అనే సీరియల్ లో ఆమె కూడా నటించారు. అంతేకాదు హిందీలో ఆమె అనేక సీరియల్స్ లో కూడా నటించారు. అంతేకాదండోయ్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ భద్రీనాథ్ సినిమాలో తమన్నా మేనత్తగా కెల్లీ డార్జ్ భార్య పాత్రలో నటించారు. ఇక రవితేజ హీరోగా నటించిన నిప్పు అనే సినిమాలో ప్రదీప్ రావత్ పోషించిన రాజాగౌడ్ అనే పాత్రకు భార్య పాత్రలో సైతం నటించారు. నిజానికి ఆమె ఇంతకు ముందే నితీష్ పాండే అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఆ తర్వాత విభేదాలతో విడాకులు తీసుకున్నారు. 2009లో ఆమె మురళి శర్మను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇక మరాఠీ, హిందీ సినిమాలు సీరియల్స్ తో బిజీ బిజీగా ఉన్న ఆమె చివరిగా తెలుగులో మెహబూబా అనే సినిమాలో నటించింది.