Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నో సేవలు అందించారు. 84 ఏళ్ళ వయస్సులో ప్రస్తుతం మురళీ మోహన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన జీవితంలో జరిగిన, ఎవరికి తెలియని సీక్రెట్స్ ను అభిమానులతో పంచుకున్నారు. మురళీ మోహన్ కు ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎలాంటి చెడ్డ పేరు లేదు. ఆయనను శ్రీరామ చంద్రుడు అని టాలీవుడ్ లో అనేవారట. ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
Project K: ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ రివీల్.. ఫ్యాన్స్ కు పండగే ?
” అక్కినేని నాగేశ్వరావు.. నన్ను శ్రీరామచంద్రుడు అని పిలిచేవారు. ఆయన అన్నందుకు అయినా.. ఆ పేరు నిలబెట్టుకోవాలని బుద్ధిమంతుడిగా ఉన్నాను. ఇక ఆ మంచితనం చూసి.. శ్రీదేవి అమ్మగారు.. నన్ను ఆమెకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. బుద్దిమంతుడు, బావున్నాడు.. ఇలాంటి అబ్బాయికి మన అమ్మాయిని ఇస్తే బావుంటుంది అనే ఫీలింగ్ ఆవిడకు వచ్చింది. ఇక ఆ తరువాత .. ఇప్పటివరకు వారితో ఎలాంటి సంబంధం లేదు. ఇక నటన ఎందుకు మానేశాను అంటే.. సినిమా చేశాక చూసుకుంటే .. హీరో ఫాదర్ లా లేడు అండి .. బ్రదర్ లా అనిపిస్తున్నారు అని అంటున్నారు. అందుకే మానేశా. ఇక సినిమాలు నిర్మించడానికి.. అతడు సినిమాకు నేనే నిర్మాతను. ఒకరోజు షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. షూటింగ్ అంతా అయ్యాకా .. ఏవండీ.. పెద్దాయన వచ్చారు . ఆయన ఉంటే సెట్ లో ఏదో భయంగా ఉంటుంది. దయచేసి ఆయనను సెట్స్ కు రావద్దు అని చెప్పండి. డబ్బులు కావాలంటే అవసరమైనప్పుడు అడుగుతాము అని చెప్పారు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
