Site icon NTV Telugu

Murali Mohan : ఒకే సినిమాకు ఏపీ, తెలంగాణ అవార్డులు వద్దు.. మురళీ మోహన్ కామెంట్స్..

Murali Mohan

Murali Mohan

Murali Mohan : తెలంగాణ ప్రభుత్వం దాదాపు పదకొండేళ్ల తర్వాత నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యురీ చైర్మన్ మురళీ మోహన్ ఆధ్వర్యంలో విజేతలను నిర్ణయించారు. 2024లో వచ్చిన సినిమాల్లోని అన్ని కేటగిరీలకు అవార్డులను ప్రకటించగా.. తాజాగా2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు బెస్ట్ ఫిలిం అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఒకే సినిమాకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అవార్డులు ఇవ్వడం మంచిది కాదు అన్నారు.

Read Also : Manoj : ఆయన కొడుకొచ్చాడని చెప్పు.. ‘భైరవం’ వేళ మనోజ్ పోస్ట్..

రెండు రాష్ట్రాలు ఒకే ఏడాది అవార్డులు ఇవ్వొద్దు. ఎందుకంటే ఒక రాష్ట్రం ఒక సినిమాకు అవార్డు ఇస్తే మరో రాష్ట్రం అదే కేటగిరీలో ఇంకో సినిమాకు అవార్డు ఇస్తే భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒక ఏడాది ఒక రాష్ట్రం ఇస్తే ఇంకో ఏడాది ఇంకో రాష్ట్రం అవార్డు ఇవ్వాలి. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు ముఖ్యమే. ఎవరు ఎక్కువ కాదు.. ఎవరు తక్కువ కాదు. కాబట్టి రెండు రాష్ట్రాలు ఈ విషయంలో అవగాహనకు రావాలి’ అని మురళీ మోహన్ అన్నారు.

Read Also : Rajnath Singh: ‘‘అలా జరిగితే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయేది’’..

Exit mobile version