Mumtaj:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ముంతాజ్. కోలీవుడ్ హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయి మెప్పించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది చిత్రంలో ‘ఓరి దేవుడా దేవుడా’ సాంగ్ లో మరోసారి పవన్ సరసన నటించిన తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. అసలు ఈ చిన్నది కోలీవుడ్ లో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. హాట్ బ్యూటీగా అమ్మడికి ఎంతో పేరు వచ్చింది కూడా.. ఇక వయస్సు పెరిగేకొద్దీ ఆమెలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎక్కువ కనిపించడంలేదు.
ఇక తాజాగా.. ముంతాజ్ హిజాబ్ ధరించి దర్శనమిచ్చింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. అందుకు ఆమె ఒక చిన్న స్టోరీకూడా రాసుకొచ్చింది. “నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్‌లో పేర్కొన్న విషయాలు నాకు అర్ధం అయ్యేవి కావు. ఒకానొక దశలో దాని అంతరార్థం తెలుసుకున్నాను. అది అర్ధం చేసుకున్నాక నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను”అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముంతాజ్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బయట ఆమెను చూసిన వారు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. ముంతాజ్ అభిమానులు ఆమె సినిమాల్లో కనిపించదు అని బాధపడుతున్నా.. మంచి నిర్ణయమే తీసుకున్నారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు.