Mumbai Police Charged Mcoca On Accused Shooters in Salman Khan Firing Case: సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ముంబై పోలీసులు ‘MCOCA’ చట్టాన్ని విధించారు. దీంతో పాటు ఇప్పుడు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు బెయిల్ రావడం కష్టంగా మారుతుండగా.. వారి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అన్మోల్‌పై క్రైం బ్రాంచ్ లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఇక MCOCA విధింపుతో ఈ కేసు ఇప్పుడు ఇంకా కఠినంగా మారింది. ఏప్రిల్ 14, ఆదివారం ఉదయం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరిపిన నిందితులు షూటర్లు సాగర్ పాల్ మరియు విక్కీ గుప్తా ఏప్రిల్ 29 వరకు పోలీసు రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు వారికి గతంలో 10 రోజుల రిమాండ్ విధించగా, నాలుగు రోజులు పొడిగించింది. ఇప్పుడు MCOCA విధించడంతో, ముంబై క్రైమ్ బ్రాంచ్ కోరుకుంటే, నిందితులను 14 రోజులకు బదులుగా 30 రోజులు కస్టడీకి తీసుకోవచ్చు.
Premikudu: వకీల్ సాబ్ కి పోటీగా ప్రేమికుడు రీ రిలీజ్
ఇది మాత్రమే కాదు, కోర్టు అనుమతి తర్వాత, ఇప్పుడు కేసులో 90 రోజులకు బదులుగా 180 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేయవచ్చు. ఎంసీఓసీఏ చట్టం కింద అరెస్టయిన నిందితులు డీసీపీ ర్యాంక్ అధికారి ఎదుట పోలీసుల విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఇప్పుడు మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంగా పరిగణించనున్నారు. దీనిని కోర్టులో సాక్ష్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు నిందితులకు కనీసం 6 నెలల వరకు సులభంగా బెయిల్ లభించదని చెబుతున్నారు. ఇక ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేసింది. జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, విదేశాల్లో ఉన్న అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌లను వాంటెడ్‌గా ప్రకటించారు. శుక్రవారం నాడు అన్మోల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. అన్మోల్ బిష్ణోయ్ కెనడాలో నివసిస్తూ తరచుగా అమెరికా సందర్శిస్తుంటాడు. అయితే అతను పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ ఐపీ అడ్రస్‌ను సెర్చ్ చేయగా దాని లొకేషన్ పోర్చుగల్ అని తేలింది.