NTV Telugu Site icon

Pushpa 2: ఇదేం వాడకం అయ్యా.. మెట్రో రైలెక్కిన పుష్ప రాజ్

Pushpa 2

Pushpa 2

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమా మీద బీభత్సమైన నమ్మకం ఉండడంతో సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ చివరికి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతుంది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించడానికి రంగం సిద్ధమైంది.

RGV : వర్మకి ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్

ఇదిలా ఉండగా ఈరోజు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగబోతోంది. ఇక ప్రమోషన్స్ లో వేగం పెంచిన సినిమా యూనిట్ తాజాగా ముంబై మెట్రో రైళ్ల మీద పుష్ప అడ్వర్టైజింగ్ చేయించారు. దీంతో పుష్ప పోస్టర్లతో ఉన్న మెట్రో రైలు ముంబై వ్యాప్తంగా పరుగులు పెడుతున్నాయి. కాదేది ప్రమోషన్స్ కి అనర్హం అన్నట్టు మెట్రో రైళ్ల మీద ఇలా స్టిక్కరింగ్ వేయించడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక మరో పక్క మనదేశంలోనే కాదు విదేశాల్లో సైతం పుష్ప మేనియా కనిపిస్తోంది. లండన్ లో అయితే ఫ్లాష్ మాబ్ చేస్తూ పుష్ప 2 సాంగ్స్ కి డాన్స్ చేస్తున్న వీడియోలను పుష్ప సినిమా అఫీషియల్ హ్యాండిల్ నుంచి షేర్ చేశారు.

Show comments