Site icon NTV Telugu

MSMP: 1.5 మిలియన్ డాలర్స్… ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్

Msmp

Msmp

జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఆగస్టు సెకండ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డే వన్‌ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరో వైపు షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా సినిమా జవాన్ థియేటర్లో ఉన్నా కూడా… ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోని అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యింది. హీరో నవీన్ పోలిశెట్టి రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా ప్రతి ఏరియాకి వెళ్లి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా మంచి బుకింగ్స్ ని రాబడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ లాగే చాలా గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నటించిన సినిమా ఇదే. దీంతో ఇద్దరు కూడా మంచి హిట్ కొట్టారు. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండడంతో ఈ శ‌ని, ఆదివారాల్లో వ‌సూళ్లు మరింతగా పెరిగే అవ‌కాశం ఉంది. స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్‌ అదిరిపోయిందంటున్నారు. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించారు.

Exit mobile version