అందం, అభినయం, ఆత్మవిశ్వాసం కలగలసిన నటి మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఎట్రీ ఇచ్చిన ఈ భామ ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాల్లో తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తుంది. అయితే ఈ మధ్య పలు వివాదాలతో మృణాల్ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. ఇక తాజాగా సక్సెస్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Baahubali : బాహుబలి ఎపిక్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఒకే వేదికపై ప్రభాస్,అనుష్క..
మృణాల్ మాట్లాడుతూ.. ‘ఒక సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? ఎంత బడ్జెట్ పెట్టారన్నది కూడా నాకు ముఖ్యం కాదు. నేను ఆ సినిమాలో మంచి ప్రదర్శన ఇచ్చానా లేదా? అదే నాకు ముఖ్యం. నేను బాగా నటిస్తే, సినిమా ఫలితం ఎలా ఉన్నా నా దృష్టిలో అది సక్సెస్ అన్నట్లే. అంటే ప్రేక్షకులను తృప్తి పరచడమే నా దృష్టిలో నిజమైన సక్సెస్. కానీ డబ్బుతో సక్సెస్‌ని కొలిస్తే అది ఎప్పటికప్పుడు మారిపోతుంది. మనసు తృప్తిపడేలా నటిస్తే అదే అసలైన విజయమని నమ్ముతాను. నేను నటనలో ఫెయిల్ అవ్వకూడదు. ప్రేక్షకులకు తెరపై మనం ఎప్పుడు బోర్ కోడతామో అది నిజమైన ఫెయిల్యూర్’ అని తెలిపింది మృణాల్. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.
