Site icon NTV Telugu

Friday Box Office : ఈ వారం రానున్న సినిమాలేవంటే ?

Jersey

Jersey

గత రెండు నెలల నుంచి బిగ్ స్క్రీన్ పై పెద్ద సినిమాలదే హవా నడుస్తోంది. రాధేశ్యామ్ మొదలుకొని ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 సినిమాల రచ్చ ఇంకా కొనసాగుతోంది. దీంతో చిన్న సినిమాల విడుదలకు వెనకడుగు వేశాయి. అయితే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. పాన్ ఇండియా సినిమా ఫీవర్ కాస్త తగ్గింది. ఇదే జోష్ ను కంటిన్యూ చేయడానికి ఇప్పుడు చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలేంటో చూద్దాం.

Read Also : RIP T Rama Rao : సినీ పరిశ్రమకు తీరని లోటు… బాలకృష్ణ

జెర్సీ
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నాని “జెర్సీ” హిందీలోనూ అదే టైటిల్ తో రూపొందుతోంది. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్ కు రెడీగా ఉంది.

1996 ధర్మపురి
గగన్‌ విహారి, అపర్ణ హీరోహరోయిన్లుగా తెరకెక్కిన సినిమా “1996 ధర్మపురి”. విశ్వజగత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని భాస్కర్‌ యాదవ్‌ దాసరి నిర్మించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ సమర్పణలో ఏప్రిల్‌ 22న థియేటర్లలోకి రానుంది.

ఇక ఈ రెండు సినిమాలే కాకుండా “ఓ మై డాగ్‌” అనే మూవీ ఏప్రిల్ 21న డైరెక్ట్ గా అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల కానుంది. ఏప్రిల్ 22న జీ 5లో అనంతం, సోని లివ్‌ లో అంత్యాక్షరి అనే సినిమాలు కూడా రాబోతున్నాయి. వీటితో పాటుగా ఈ నెల 22నే ‘బొమ్మల కొలువు’, ‘నాలో నిన్ను దాచానే’, ‘తపన’ సినిమాలు, 23న ధర్మస్థలి మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన “గని” కూడా ఏప్రిల్ 22న ఆహాలో సందడి చేయబోతున్నాడు.

Exit mobile version