NTV Telugu Site icon

‘సుల్తాన్’ తెలుగు ట్రైలర్

Sulthan (Telugu) Trailer Out Now

కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘సుల్తాన్’. ఈ ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెపోలియన్, లాల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. వివేక్ – మెర్విన్ సంగీతం అందించగా… ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా ‘సుల్తాన్’ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. తాజాగా ‘సుల్తాన్’ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలు, రష్మిక, కార్తీ మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో రష్మిక పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామర్ రోల్ లో మెరిసింది. రశ్మికకు తమిళంలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. మీరు కూడా ‘సుల్తాన్’ తెలుగు ట్రైలర్ ను వీక్షించండి.