Site icon NTV Telugu

AamirKhan : ‘సితారే జమీర్ పర్’ ట్రైలర్ రిలీజ్..

Amir Khan

Amir Khan

బాలీవుడ్ లోని బడా హీరోలలో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఒకరు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ టాప్ ప్లేస్ లో ఉంది. అలాంటి అమీర్ ఖాన్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లోప్స్ చూస్తున్నాడు. హిట్ కొట్టేందుకు కిందా మీదా అవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తగ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి సీనియాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో సినిమాలకు కాస్త లాంగ్ గ్యాప్ ఇచ్చాడు అమిర్ ఖాన్. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పర్ఫెక్ట్ గా రెడీ చేసుకుని వస్తున్నాడు.

ఈ నేపధ్యంలో 2007 లో అమిర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం తారే జమీన్ పర్. ఇప్పుడు ఆ సూపర్ హిట్ కు సీక్వెల్ గా ‘సితారే జమీన్ పర్’ ను తీసుకువస్తున్నాడు అమిర్ ఖాన్. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను అమీర్ ఖాన్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. బాస్కెట్ బాల్ కోచ్ గా కనిపించాడు అమీర్. 3 : 28 నిమిషాల ట్రైలర్ లో కథ మొత్తం చెప్పేసారు మేకర్స్. తన ప్రవర్తన సరిగా లేని కారణంగా మానసికంగా ఎదుగుదల లేని కొందరికి బాస్కెట్ బాల్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఉన్నంతగా తీర్చిదిద్దాలని కోచ్ అమీర్ కు శిక్ష వేస్తుంది కోర్ట్. వారిని అమీర్ గెలిపించాడ లేదా అనేది మిగిలిన కథ. అమీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అమీర్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Exit mobile version