అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. అద్భుతమైన డైలాగ్స్, అవుట్ స్టాండింగ్ డైరెక్షన్, నటీనటుల ఇన్ క్రెడిబుల్ పెర్ఫార్మెన్స్ తో ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘సిల్లీ ఫూల్స్’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. పూర్ణిమ ‘సిల్లీ ఫూల్స్’కు సాంగ్ ను ఆలపించగా, దర్శకుడు అనుదీప్ కేవి, వామ్స్ గౌడ్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. మీరు కూడా ఈ ‘సిల్లీ ఫూల్స్’ వీడియో సాంగ్ ను వీక్షించండి.
జాతి రత్నాలు : ‘సిల్లీ ఫూల్స్’ వీడియో సాంగ్
