Site icon NTV Telugu

విశ్వక్ సేన్ విడుదల చేసిన ‘మెరిసే మెరిసే’ ట్రైలర్

Merise Merise Trailer out Now

దినేష్ తేజ్, శ్వేతా అవస్తి నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశాడు.

Read Also : రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!

ట్రైలర్ చాలా బాగుందన్న విశ్వక్ సేన్… దినేష్ తేజ్ తను ‘హుషారు’ టైమ్ నుంచి ఫ్రెండ్స్ మి అని… కలిసి క్రికెట్ ఆడేవాళ్లమని చెప్పాడు. తను మంచి టాలెటెండ్ ఆర్టిస్ట్ అని ‘మెరిసే మెరిసే’ హిట్ కావాలని కోరుకుంటున్నానన్నారు. ఇక థియేటర్లు ఓపెన్ కావడం సంతోషకరమైన విషయమన్న విశ్వక్… ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్ లో సినిమా చూసిన అనుభూతి వేరన్నాడు. విశ్వక్ సేన్ ది సక్సెస్ ఫుల్ హ్యాండ్ అని… అది తమ సినిమాకూ కలిసొస్తుందని దర్శకుడు పవన్ చెప్పగా… ఆగస్టు 6న థియేటర్స్ లో కలుకుందామని హీరో దినేష్ తేజ్ తెలిపాడు.

Exit mobile version