Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న ‘సెహరి’ టీజర్

Harsh Kanumilli's Sehari Teaser Out Now

హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో ఫ్రెష్ కంటెంట్ ఉన్నట్టుగా కన్పిస్తోంది. హీరో ఒక అమ్మాయిని ప్రేమించి, మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధం కావడం, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే ఫ్రెష్ లవ్ స్టోరీలా అన్పిస్తోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Exit mobile version