స్పార్క్ ఓటీటీలో ఈ నెల 28న స్ట్రీమింగ్ కాబోతోంది ‘క్యాబ్ స్టోరీస్’ వెబ్ సీరిస్ వాల్యూమ్ 1. దివి వధ్య, గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ కు కేవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కృష్ణ నిర్మించారు. ఇప్పటికే దీని టీజర్ ను విడుదల చేశారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ట్రైలర్ ను తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా రిలీజ్ చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ట్రైలర్ చూస్తుంటే బిగ్ బాస్ 4 ఫేమ్ దివి ఏ సంఘటననైనా తనకు అనుకూలంగా మలుచుకునే జాణ అనే భావన వ్యూవర్స్ కు కలుగుతోంది. దానికి తోడు ఇతర పాత్రధారుల్లోనూ ఎవరిది పాజిటివ్ క్యారెక్టర్, ఎవరిది నెగెటివ్ క్యారెక్టర్ అనేది అర్థం కాకుండా దర్శకుడు బాగానే సస్పెన్స్ మెయిన్ టైన్ చేశాడు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ వెబ్ సీరిస్ కు సాయికార్తీక్ స్వర రచన చేశాడు. తమ్మిరాజు ఎడిటర్. మరి ఓటీటీ రంగంలోకి కొత్తగా వచ్చిన స్పార్క్ ఏ స్థాయిలో దీనిని విజయపథంలోకి తీసుకెళుతుందో చూడాలి.
తమన్నా ఆవిష్కరించిన ‘క్యాబ్‌స్టోరీస్` ట్రైలర్
