Site icon NTV Telugu

Tollywood: షూటింగులకు బ్రేక్.. నిర్మాతల సంచలన నిర్ణయం..?

Tollywood

Tollywood

Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతుందా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది. థియేటర్లో సినిమాలు, ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా సినిమాలు హిట్ ను అందుకొని టాలీవుడ్ ను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు నిర్మాతలు. ఇటీవలే 24 క్రాఫ్ట్స్ కు చెందిన టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు తమ వేతనాన్ని పెంచాలని సమ్మె చేసిన విషయం విదితమే. ఎలాగోలా తంటాలు పడి నిర్మాతల మండలి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చింది. 10% వేతనాలు పెంచుతున్నట్లు తెలిపి మళ్లీ షూటింగ్లు స్టార్ట్ చేశారు.

ఇక ఇప్పుడు నిర్మాతలు చేతులెత్తేయడం గమనార్హం.. ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చినప్పటి నుంచి.. థియేటర్ లో బొమ్మ పడేవరకు అన్ని ఖర్చులు నిర్మాత మీదే ఉంటాయి. హీరో హీరోయిన్ల రెమ్యూనిరేషన్లు కోట్లలో ఇవ్వాల్సి వస్తోంది. భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాఫిక్స్, లొకేషన్స్ అన్నీ నిర్మాతలే భరించాలి. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా భారీ పారితోషికాలు డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్స్ చేతులెత్తేశారు. సినిమాలు చేయడం మా వలన కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయమై టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక సంచలనం నిర్ణయం తీసుకోనున్నదని తెలుస్తోంది. శనివారం టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం.

ఇక ఈ రెమ్యూనిరేషన్లు, భారీ బడ్జెట్లు పెట్టడం తమ వలన కాదని, అందుకే కొన్ని నెలలు షూటింగ్లు ఆపేయాలని ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం దొరికినాకనే మళ్లీ షూటింగ్లు మొదలు కానున్నాయట. నటులు, కార్మికులు సమ్మె చేయడం కాదు నిర్మాతలు కూడా సమ్మె చేస్తే తప్ప తమ ఇబ్బందులు తెలియవని అంటున్నారట నిర్మాతలు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మరోసారి ఇండస్ట్రీ కుదేలు అవ్వడం ఖాయం. ఇలాంటి నిర్ణయం వలన నటులకు అయితే నష్టపోరు కానీ రోజువారీ పనిచేసుకునే ప్రొడక్షన్ కార్మికులు నష్టపోతారు. మరో రెండు రోజుల్లో నిర్మాతలు ఒక అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Exit mobile version