Site icon NTV Telugu

లతా మంగేష్కర్ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

Lata-Mangeshkar

భారత నైటింగేల్, భారతరత్న, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఈరోజు ఉదయం అందరికీ షాక్ ఇచ్చింది. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ఆదివారం ఉదయం 8:12 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ లెజెండరీ సింగర్ జనవరి మొదట్లోనే కరోనా బారిన పడింది. ఆమెను అప్పటికే న్యుమోనియా కూడా ఉండడంతో పరిస్థితి విషమించింది. లతా పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్త సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కూడా వరుసగా ట్విట్టర్ లో లతా మంగేష్కర్ కు నివాళులు అర్పిస్తున్నారు.

భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరని లోటు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. 7 దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30 వేల పాటలు పాడటం లతా మంగేష్కర్ గాన మాధుర్యానికి నిదర్శనం. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు.. భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే…అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయి. లతా మంగేష్కర్ మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు.

Exit mobile version