NTV Telugu Site icon

Mouli Talks: ఏపీ క్యాపిటల్ పై జోక్.. తల్లితండ్రులను లాగొద్దు ప్లీజ్ అంటూ #90స్ మౌళి ట్వీట్

Mouli Talks

Mouli Talks

Mouli Talks Tanuj Prashant Says Apology about AP Capital joke: ఈ మధ్య 90స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు తనూజ్ మౌళి ప్రశాంత్. రఘు అనే పాత్రలో శివాజీ కుమారుడిగా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. నిజానికి ఈ వెబ్ సీరిస్ లో నటించడం కంటే ముందే అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అప్పుడప్పుడు కామెడీ స్టాండ్ కామెడీ షోలు కూడా చేస్తూ ఉండేవాడు. గతంలో అలా చేసిన ఒక స్టాండ్ అప్ కామెడీ షో కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తన చేతిలో ఒక వస్తువు పెట్టుకుని మాయమైపోయిందని మౌళి చెబుతాడు.

Sandeep Reddy Vanga : యానిమల్ మూవీ చూసిన సందీప్ కొడుకు రియాక్షన్ ఏంటో తెలుసా..?

అదేంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ కాపిటల్ అంటూ వేసిన జోక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ నుంచి వ్యతిరేకత వస్తూ ఉండడంతో ఈ విషయం మీద మౌళి స్పందించాడు. తాను వేసిన ఒక జోక్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోందని తనమీద హేట్ స్ప్రెడ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. తనకు ఈ జోక్ వెయ్యడంలో ఎలాంటి పొలిటికల్ ఇంటెన్షన్స్ కానీ ఎవరిని డీ గ్రేడ్ చేసే ఉద్దేశం కానీ లేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ అది ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తినేలా చేస్తే తాను సారీ చెబుతున్నానని మౌళి చెప్పుకొచ్చాడు. నేను మామూలుగా హెల్తీ కామెడీనే చేస్తా, సాధారణంగా ప్రేక్షకులను నవ్వించడమే నా ఉద్దేశం. అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు దయచేసి నా తల్లిదండ్రులని ఇందులోకి లాగవద్దు అంటూ ఆయన కామెంట్ చేశాడు.

Show comments