Site icon NTV Telugu

ఇతర భాషల్లో ‘అను అండ్ అర్జున్’గా ‘మోసగాళ్ళు’

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్ళు’ ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించపోయినా అతి త్వరలోనే అది జనం ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా మీద బజ్ ను పెంచాయి. ‘ది వరల్డ్ బిగ్గెస్ట్ ఐడీ స్కామ్’ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాక తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ‘అను అండ్ అర్జున్’ అనే పేరు ఖరారు చేశారు. కానీ మలయాళంలో మాత్రం ‘అర్జున్ అండ్ అను’ అని పెట్టారు. కాజల్, సునీల్ శెట్టి,  నవీన్ చంద్ర, నవదీప్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించిన ఈ థ్రిల్లర్ మూవీకి జెఫ్రీ దర్శకత్వం వహించారు. 2015లో ఓ సోదరుడు తన సోదరితో కలిసి గుజరాత్, ముంబైలో చేసిన భారీ ఐటీ స్కామ్ ఈ సినిమా కథ రూపకల్పనకు ఆధారమని మంచు విష్ణు చెబుతున్నారు. ఆ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలను మంచు విష్ణు, కాజల్ పోషిస్తుండటం విశేషం.

Exit mobile version