Site icon NTV Telugu

Monika Bhadoriya: ఆ టార్చర్ భరించలేక చనిపోవాలనుకున్నా.. బుల్లితెర నటి బాంబ్

Monika On Tmkoc

Monika On Tmkoc

Monika Bhadoriya Describes Taarak Mehta Ka Ooltah Chashmah Experience As Torture: ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ (TMKOC) టీవీ షో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. హిందీ ప్రేక్షకుల నుంచి గణనీయమైన ఆదరణ పొందిన ఈ కార్యక్రమం.. కొన్ని సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తోంది. అలాంటి ఈ షో ఇప్పుడు తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ షో నుంచి ఒక్కొక్కరుగా బయటకొస్తున్న నటీనటులు.. నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తమతో గొడ్డు చాకిరి చేయించుకుంటారని, కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా విశ్రాంతి ఇవ్వరంటూ బాంబ్‌లు పేలుస్తున్నారు. పురుషులకు ఇస్తున్న మర్యాద తమకు లేదని, ఒక్క రోజు లీవ్ కూడా ఇవ్వకుండా నరకయాతన చూపిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నటి మోనికా భడోరియా కూడా అలాంటి ఆరోపణలే చేసింది. ఆ షో నిర్మాతలు తనని వేధించారని పేర్కొంది.

Arvind Kejriwal: రేపు అఖిలేష్ యాదవ్‌తో అరవింద్ కేజ్రీవాల్ భేటీ.. దానిపైనే కీలక చర్చ..

TMKOC షో కోసం పని చేస్తున్న సమయంలో తనని తీవ్రంగా హింసించారని, ఆ టార్చర్ భరించలేక తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని మోనికా భడోరియా తెలిపింది. తనతో వెట్టి చాకిరి చేయుంచుకొని, చివరకు తనకు రావాల్సిన రెమ్యునేషన్‌ కూడా ఇవ్వలేదని వాపోయింది. ఆ షో సెట్స్‌లోని తన రోజులను ‘హెల్’ (నరకం)గా అభివర్ణించింది. చివరకు తన తల్లి క్యాన్సర్ చికిత్స పొందుతున్నప్పుడు కూడా.. షో యూనిట్‌ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని పేర్కొంది. తల్లి చికిత్స సమయంలో తాను రాత్రంతా ఆసుపత్రిలోనే ఉండేదాన్నని, అది తెలిసి కూడా ఆ షో నిర్మాతలు ఉదయాన్నే తనను షూటింగ్ కోసం పిలిచేవారని చెప్పింది. నా మానసిక స్థితి సరిగా లేదని చెప్పినా, షూట్‌కి రావాల్సిందేనంటూ బలవంతం చేసేవారని.. ఎదురు ప్రశ్నించలేక షూట్‌ కోసం వెళ్తే, అక్కడ తనను వెయిట్‌ చేయించేవారని భావోద్వేగానికి లోనైంది. తన కుటుంబంలో తాను ఎన్నో విషాదాల్ని ఎదుర్కొన్నానని.. తక్కువ కాలంలోనే తల్లిని, అమ్మమ్మను కోల్పోయానని కన్నీరు పెట్టుకుంది. వారు లేరనే బాధను భరించలేక తన జీవితం ముగిసిపోయిందని అనుకున్నానని చెప్పింది.

Ginger – Tomato Price: అల్లం ధర ఆకాశాన్నంటుతుంది.. టమాట టెక్ చూపిస్తోంది

అలాంటి సమయంలో కూడా తాను TMKOC కోసం పని చేశానని, అప్పుడు కూడా వారు హింసించేవారని మోనికా చెప్పింది. తన తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు.. తాము వైద్యం కోసం డబ్బులు ఇచ్చామని నిర్మాతలు ప్రచారం చేసుకున్నారని, ఆ మాటలు తనని తీవ్రంగా బాధించాయని తెలిపింది. ఈ షో సెట్స్‌కు తన తల్లిని తీసుకురావాలన్నది తన డ్రీమ్ అని.. అయితే అక్కడి వాతావరణం చూశాక ఎప్పుడూ తల్లిని సెట్స్‌కి తీసుకురాకూడదని నిర్ణయించుకున్నానని పేర్కొంది. కాగా.. ఈ షోలో బావ్రీ పాత్రలో నటించిన మోనికా, 2019లో ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంది.

Exit mobile version