NTV Telugu Site icon

Shanmukh Brother:అనేకసార్లు రేప్ చేశాడు, అబార్షన్ చేయించాడు.. షన్ను అన్న నిజస్వరూపం బయటపెట్టిన యువతి

Shannu Ganjai

Shannu Ganjai

Monica Reveals Facts Behind Shanmukh Jaswanth Arrest : యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ అరెస్ట్ అయిన కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షణ్ముఖ్ జస్వంత్ అన్న సంపత్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో గంజాయి తాగినట్లు గుర్తించి సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతని ఫ్లాట్లో పెద్ద ఎత్తున గంజాయి లభించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో మౌనిక అనే డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖకు చెందిన తనకు యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్ మోసం చేశాడని ఫిర్యాదులో మౌనిక పేర్కొంది. షణ్ముఖ సోదరుడు సంపత్ తాను ప్రేమిస్తున్నాడు అనే నెపంతో పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. రింగు తొడిగి పెళ్లయిపోయిందని చెప్పాడని పేర్కొన్న మౌనిక పలు హోటల్స్, విల్లాలకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది.

Jharkhand: హేమంత్ సోరెన్‌కు కోర్టులో చుక్కెదురు

ఇక ఈ క్రమంలో ఒకసారి గర్భం దాలిస్తే అబార్షన్ కూడా చేయించాడని మౌనిక పేర్కొంది. షణ్ముఖ్, సంపత్ తండ్రి అప్పారావు ద్వారా సంపత్ కి మరో పెళ్లి అయింది అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానని అయితే ఆ సమయంలో కాంప్రమైజ్ కావాలని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చారని మౌనిక చెప్పుకొచ్చారు. అయితే తాను సంపత్ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న షణ్ముఖ్ తో కలిసి అతను గంజాయి తీసుకుంటున్నాడని ఈ సందర్భంగా మౌనిక పేర్కొంది. వాళ్ల దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయని మౌనిక వెల్లడించింది. ఇక సుమారు మూడేళ్ల క్రితం వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందని మౌనిక తల్లి అనారోగ్యం దృష్ట్యా వివాహం వాయిదా పడుతూ వస్తోందని చెబుతున్నారు. ఈ లోపల సంపత్ మరొక యువతిని వివాహం చేసుకున్నట్లు మౌనిక గుర్తించింది. మౌనిక, సంపత్ మరో ఆరు రోజుల్లో అంటే 28వ తేదీన వివాహం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈలోపే మరో యువతితో సంపత్ వివాహం చేసుకోవడం గమనార్హం.