‘మనీ హెయిస్ట్’… ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న వెబ్ సిరీస్. మతిపొగొట్టే యాక్షన్ సీన్స్ తో సాగే ఈ స్పానిష్ థ్రిల్లర్ ఇంగ్లీష్ వర్షన్ తో ఇంటర్నేషనల్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే, గత సంవత్సరం ఏప్రెల్ లో నాలుగో సీజన్ జనం ముందుకు రాగా త్వరలో 5వ సీజన్ అలరించనుంది. నాలుగో సీజన్ ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్ ని అనూహ్య మలుపులతో మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రతీ సీజన్ ని ఆసక్తికరంగా ముగించే ‘మనీ హెయిస్ట్’ వెబ్ సిరీస్ మేకర్స్ 4వ సీజన్ కూడా అలాగే ముగించారు. 5వ సీజన్ కి బీజాలు వేస్తూ అర్ధాంతరంగా ముగించారు. అందుకే, నెలల తరబడి ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్ పడిగాపులు కాస్తున్నారు. అయితే, నెట్ ఫ్లిక్స్ రాబోయే 5వ సీజన్ ‘మనీ హెయిస్ట్’ పరంపరకి ఫైనల్ అంటూ ప్రకటించేసింది. అంటే, 6వ సీజన్ ఉండబోవటం లేదన్నమాట!
స్పానిష్ భాషలో అలెక్స్ పినా రూపొందించిన ‘మనీ హెయిస్ట్’ ముగిసిపోవటం కొంత లోటుగా అనిపించే విషయమే అయినా… త్వరలోనే అన్ని చిక్కుముడులు విడిపోయి… కథ ‘ది ఎండ్’కి చేరటం… ఆహ్వానించాల్సిన పరిణామమే! అయితే, 5వ సీజన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ రీసెంట్ గా మేకర్స్ ఓ 30 సెకన్లు టీజర్ విడుదల చేశారు. కీలకమైన ‘ద ప్రొఫెసర్’ క్యారెక్టర్ చెయిన్లతో కట్టివేయబడి పోలీసుల అదుపులో ఉండటం అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది!
ఆగస్ట్ 2న పూర్తిస్థాయి ట్రైలర్ తో అలరించనున్న ‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 ఒకేసారి జనం ముందుకు రావటం లేదు. సెప్టెంబర్ 3న 5 ఎపిసోడ్లతో వాల్యూమ్ 1 స్ట్రీమింగ్ అవుతుంది. ఇక డిసెంబర్ 3న, లాస్ట్ బట్ నాట్ లీస్ట్… ‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 వాల్యూమ్ 2… ఫైనల్ 5 ఎసిసోడ్స్ ప్రేక్షకుల ముందుకొస్తాయి! సో… ‘మనీ హెయిస్ట్’ సూపర్ సస్పెన్స్ కంప్లీట్ డెడ్ ఎండ్ కి చేరేది… డిసెంబర్ 3న అన్నమాట!
