Site icon NTV Telugu

Mohanlal: ‘మలైకోటై వాలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

Mohan Lal

Mohan Lal

Malaikottai Vaaliban: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఈ సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ మరో కారణం. మలయాళీల నూతన సంవత్సరం విషు పర్వదినాన టీం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు. ఈ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎంత ఉత్కంఠగా ఉండనుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్లపై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ సంయుక్తంగా దీన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జనవరి 18న రాజస్థాన్ లోని జై సల్మెర్ లో ప్రారంభమైన షూటింగ్ అక్కడే కొనసాగుతోంది.

ఎన్నో అంచనాలున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకులు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఈ చిత్ర కథ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉండగా అవేవీ ‘మలైకోటై వాలిబన్’ కు సంబంధించినవి కావని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. హై బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం మలయాళం తో పాటుగా ఇతర ప్రముఖ భాషలన్నిటిలో విడుదల కానుంది. మధు నీలకందన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి పి ఎస్ రఫిక్ స్క్రిప్ట్ వర్క్ అందిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తుండగా, దీపు జోసెఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.

Exit mobile version