Site icon NTV Telugu

‘మాన్ స్టర్’గా మోహన్ లాల్…. షూటింగ్ షురు!

మోహన్ లాల్ నటించిన ‘పులిమురుగన్’ చిత్రాన్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో సినిమా మొదలైంది. మోహన్ లాల్, ‘పులిమురుగన్’ దర్శకుడు వైశాఖ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘మాన్ స్టర్’ అనే పేరు పెట్టారు. నవంబర్ 11 నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఇందులో సర్దార్ లక్కీ సింగ్ గా మోహన్ లాల్ కనిపించబోతున్నారు. తలపాగ కట్టి, ముందు తుపాకులను పెట్టుకున్న తీక్షణంగా చూస్తున్న మోహన్ లాల్ ను చూస్తుంటే ఆయన పోలీస్ అధికారి లేదా ఏజెంట్ పాత్ర పోషిస్తున్నారనిపిస్తోంది. ‘పులి మురుగన్’కు రచన చేసిన ఉదయ్ కృష్ణ ఈ సినిమాకూ స్క్రీన్ ప్లే సమకూర్చుతున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు.

Exit mobile version