Site icon NTV Telugu

Mohanlal: ఇది నిజమేనా అని అనిపించింది..’ దాదాసాహెబ్ ఫాల్కే గౌరవంపై మోహన్‌లాల్ ఎమోషనల్

Mohanlal

Mohanlal

మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి.. 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. మోహన్‌లాల్‌ అద్భుత సినీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తేలిపారు. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ను ఈ అవార్డుతో సత్కరించనున్నారు.

Also Read : Vedhika : గ్లామర్‌ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వేదిక..

ఈ ఘనతపై మోహన్‌లాల్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. “ఈ గొప్ప అవార్డు నా జీవితంలో అత్యుత్తమ క్షణాలలో ఒకటిగా ఉంటుంది. విన్నప్పుడు నిజంగానే ‘ఇది నిజమేనా?’ అని అనిపించింది. ఈ అవార్డును కేవలం నాకే కాకుండా తోటి కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, సెట్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరు మరియు అభిమానులతో పంచుకోవాలనుకుంటున్న’ అని తెలిపారు. మోహన్‌లాల్ వెల్లడించినట్లుగా, ఈ అవార్డు కేవలం వ్యక్తిగత సాధనకే పరిమితం కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి వ్యక్తి కృషికి గౌరవం. ఈ ఘనత ఆయన జీవితంలో గర్వకరమైన క్షణంగా నిలుస్తూ, భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లను సృష్టించడానికి ప్రేరణగా మారనుంది.

 

Exit mobile version