Mohankrishna Indraganti -Priyadarshi Combo Movie on Cards: తెలుగు సినీ పరిశ్రమలో ఒకపక్క కమెడియన్ గా కొనసాగుతూనే మరొక పక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు ప్రియదర్శి. ప్రియదర్శి హీరోగా నటించిన మొదటి సినిమా మల్లేశం కలెక్షన్స్ తీసుకు రాక పోయినా మంచి సినిమాగా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆయన హీరోగా వచ్చిన బలగం సినిమా ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా దక్కించుకుని చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు ప్రియదర్శి హీరోగా మరొక సినిమా పట్టాలెక్కెందుకు రంగం సిద్ధమైంది. ఇక ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి వ్యవహరించనున్నారు. చివరిగా సమ్మోహనం అనే సినిమాతో ఓ మాదిరి హిట్ అందుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఆ తర్వాత చేసిన వితో ప్రేక్షకులను మెప్పించలేక పోయారు.
Chaari 111 First Review: వెన్నెల కిశోర్ చారి 111 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
అంతేకాక 2022 లో రిలీజ్ అయిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆయన దర్శకుడిగా ప్రియదర్శి హీరోగా ఒక సినిమా తెరకెక్కేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన అష్టా చెమ్మా, సమ్మోహనం సినిమాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ తన శ్రీ దేవి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా కామెడీ టచ్ ఉంటూనే ఆలోచింప చేసే సబ్జెక్ట్ అని అంటున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. హీరోగా రెండు హిట్లు అందుకున్న ప్రియదర్శి మరో పక్క కమెడియన్ గా కూడా సినిమాలు చేస్తున్నారు.