Site icon NTV Telugu

మరో సీనియర్ హీరోతో ‘ఆహా’ చర్చలు

Mohan-Babu

పాపులర్ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ జెట్ స్పీడ్ తో సరికొత్త షోలతో దూసుకెళ్తోంది. ‘ఆహా’కు, అందులో ప్రసారమవుతున్న షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి దిగ్గజ ఓటిటి సంస్థలు సైతం షాకవుతున్నాయని ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో లాంచ్ చేసిన వేదికపై తెలిపారు. తెలుగు ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘సామ్ జామ్’ అంటూ సమంతను హోస్టుగా మార్చి పలువురు సెలెబ్రటీలతో షో చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ‘ఆహా’లో రానున్న మోస్ట్ అవైటెడ్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ కోసం ఎదురు చూస్తున్నారు.

Read Also : “ధమాకా” ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన మాస్ మహారాజ

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా ఈ షోతో ఓటిటి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా హోస్టుగా మారబోతున్నారు. ఇప్పటిదాకా వెండితెరపై ఆయన నట విశ్వరూపాన్ని చూసిన ప్రేక్షకులు త్వరలోనే హోస్టుగా ఆయనలో సరికొత్త కోణాన్ని చూడబోతున్నారు. ఈ షో నవంబర్ 4న ప్రసారం కానుంది.

కాగా ఫిల్మ్ సర్కిల్స్ లో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం ‘ఆహా’ మరో సీనియర్ హీరోతో ఓ కార్యక్రమం ప్లాన్ చేస్తోంది. సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఓటిటి ప్రాజెక్ట్ కోసం ‘ఆహా’ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో టాక్ షోను హోస్ట్ చేస్తారా? లేదా వెబ్ సిరీస్‌లో నటిస్తారా ? అనేది చూడాలి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

Exit mobile version