Site icon NTV Telugu

Mohan Babu: ఓటమి సహించలేక.. వాళ్లేం చేశారో అందరికీ తెలుసు

Mohan Babu Press Meet

Mohan Babu Press Meet

Mohan Babu Comments On MAA Association: మా అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా.. మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించాడు. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్ బాబు.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తొలుత తన స్నేహితుడు, సీనియర్ నటుడు కృష్ణంరాజుని గుర్తు చేసుకున్నారు. మంచు విష్ణుకి ఎన్నో మంచి విషయాలు సలహాలు ఇచ్చేవారని, ఇప్పుడు ఆయన లేని లోటు తీవ్రంగా బాధిస్తోందని అన్నారు. అనంతరం మంచు విష్ణు ప్యానెల్ సభ్యులందరూ అద్బుతంగా పనితనం చాటుతున్నారంటూ కొనియాడారు. ఓడిపోవడం, గెలవడం సహజమేనని.. కానీ మా ఎన్నికల్లో ఓటమిని సహించలేక కొందరు ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. రమణ మహర్షి చెప్పినట్టు.. ఎన్ని దుర్గుణాలున్నాయో, వాటిని మిక్సీలో వేశాక తయారయ్యేవాడే మనిషి అని అన్నారు. అంటే.. మనిషి మొత్తం విషమేనని, ఎన్నికల్లో ఓడిపోయాక కొందరు తమలోని విషాన్ని చిమ్మారని, అయినప్పటికీ వాళ్లు బాగుండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

తాను మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఎప్పుడు ఇలాంటి మీటింగులు గానీ, డిన్నర్‌లు ఇవ్వడం గానీ చేయలేదని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సెల్ఫ్ డబ్బా’ నిర్వచనాన్ని వివరిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కూడా అవసరమేనని అన్నారు. రామాయణంలో సీత ముందు హనుమంతుడు వినయంగా ఉంటే, రావణుడి ముందు మాత్రం విశ్వరూపం చూపించాడని.. అలాగే మనం ఏం చేశామన్నది పది మందికి చెప్పడం తప్పేం కాదని, అది సద్గుణమని చెప్పారు. మంచి పని చేయకుండా గొప్పలు చెప్పుకుంటే సెల్ఫీ డబ్బా అవుతుందని.. మంచి పని చేస్తున్నప్పుడు, చేసి చూపిస్తున్నప్పుడు ‘సెల్ఫ్ డబ్బా’ కాదని చెప్పుకొచ్చారు. మంచు విష్ణు చేసే పనుల్లో మోసం లేదు, దగా లేదని అన్నారు. మా సభ్యులందరికీ శిరిడీ సాయి ఆశీస్సులు ఉండాలని కోరిన ఆయన.. అందరూ కలిసి ఐక్యంగా ఉండాలని సూచించారు.

Exit mobile version