ఎమ్ ఎమ్ కీరవాణి గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సంగీతానికి, ఆయన గొంతుకు ఫిదా కానివారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇక కీరవాణి మృదు స్వభావి. నోరు జారీ ఒకరిని మాట అనరు, ఒకరి చేత మాట పడరు. ఈ విషయాన్నీ ఎన్నో ఇంటర్వ్యూలో కీరవాణి తమ్ముడు,దర్శక ధీరుడు రాజమౌళి చెప్పుకొచ్చాడు. అలాంటి మృదు స్వభావికే కోపం తెప్పించాడు సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై రసూల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఎలాంటి సంచలనం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఒక గే లవ్ స్టోరీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లతో పాటు ప్రముఖులు కూడా అతడిని ఏకిపారేస్తున్నారు.
ఇప్పటికే నిర్మాత శోభు యార్లగడ్డ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు కీరవాణి తనదైన శైలిలో రసూల్ కు కౌంటర్ ఇచ్చారు. కర్ర విరగకుండా పామును చంపేశారు అంటూ ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అందులో ఆయన అసభ్య పదజాలాన్ని వాడడం కొంతమందికి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “అప్పర్ కేసు, లోయర్ కేసు టైప్ చేయడంలో నేను చాలా బ్యాడ్.. కానీ ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేయడంలో తప్పు లేదు.. అది రసూల్ పోకుట్టి కి కూడా వర్తిస్తుంది” అని చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ తెలుగులో చదివితే బాగానే అర్ధమవుతుంది కానీ.. ఇంగ్లీష్ లో చదివే వారికి చివర్లో రసూల్ పూకుట్టి పేరులోని చివరి అక్షరాలు అసభ్య పదాన్ని గుర్తుచేస్తున్నాయి. దీంతో కీరవాణి నోట.. అంత పెద్ద మాట ఎలా వచ్చింది అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక ఈ ట్వీట్ చేసిన పది నిమిషాలకే కీరవాణి ట్వీట్ డిలీట్ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. మరోపక్క సూపర్ సార్.. కర్ర విరగకుండా పామును చంపేశారు.. చాలా బాగా చెప్పారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
