Site icon NTV Telugu

Mithra-Mandali: ‘మిత్ర మండలి’ని మనసుతో చూడండి.. హిట్ గ్యారెంటీ అంటూ శ్రీ విష్ణు!

Mitramandali

Mitramandali

బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో, సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్ఎం హీరోయిన్‌గా నటించారు. దర్శకుడు విజయేందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ వంటి కామెడీ స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తిగా కామెడీ, ఎమోషనల్ కలయికగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఇందులో హీరో శ్రీ విష్ణు స్పెషల్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..

Also Read : Pradeep Ranganathan:“ప్రదీప్ రంగనాథన్ లీక్‌తో ఫౌజీ టైటిల్ ఫిక్స్‌?

“విజయ్ నా సినిమా తిప్పరామీసం టైమ్‌లో ఏడీగా పనిచేశాడు. ఇప్పుడు డైరెక్టర్‌గా నిలబడ్డాడు. ఈ మిత్ర మండలి సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. ఇందులో నటించిన రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ – వీరంతా నాకు చాలా ఇష్టం. ప్రియదర్శి ఎప్పుడూ ఎనర్జీతో ఉంటాడు, మంచి కథల్ని ఎంచుకుంటాడు. ఈసారి కూడా అదే ఫలితం వస్తుంది. అలాగే నిహారిక ఆమె రీల్స్ నేను చాలాసార్లు చూశాను. ఇప్పుడు సినిమాల్లో కూడా బాగా చేస్తోంది. నిర్మాతలైన కళ్యాణ్, భాను, సోము, విజేందర్ అందరూ నా స్నేహితులే. బన్నీ వాస్ గారు నెలకి ఒక హిట్ సినిమా ఇస్తున్నారు. ఆయన పేరు ఉంటే హిట్ గ్యారెంటీ అన్న మాట ఖాయం. ఈ సినిమా కేవలం మైండ్‌తో కాదు, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది, హ్యాపీగా ఫీల్ అవ్వేట్టుగా ఉంటుంది” అని మిత్ర మండలి టీమ్‌కు అల్ ది బెస్ట్ తెలిపాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ప్రియదర్శి, నిహారిక కాంబినేషన్‌పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

Exit mobile version