ఈ దీపావళి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ “మిత్ర మండలి” ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేస్తోంది. ప్రియదర్శి, రాగ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూస్ సాధించినప్పటికీ, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ మధ్య మరింత పాప్యులారిటీ సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ సినిమాకి విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించగా, నిహారిక ఎన్.ఎం హీరోయిన్‌గా నటించింది.
Also Read : Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజతో.. వశిష్ట కొత్త ప్రాజెక్ట్!
బన్నీ వాసు సమర్పణలో విడుదలైన ఈ సినిమా స్నేహం, యువత జీవితంలో వచ్చే ఎమోషనల్ ట్విస్ట్స్, ఫన్ మూమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు, కామెడీ సీక్వెన్స్‌లు సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి కేవలం తెలుగు భాషలోనే అందుబాటులోకి రానుందని ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం కానుంది. స్నేహం, హాస్యం, యువత మైండ్‌సెట్ అన్నీ కలగలిపిన మిత్ర మండలి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
