Mistake movie streaming in AHA Video: ఈ మధ్య కాలంలో థియేటర్లలో సందడి చేసే ఇటీవలే ఆహాలో రిలీజ్ అయింది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మిస్టేక్’. ‘రామ్ అసుర్’ సినిమా తర్వాత ‘మిస్టేక్’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న అభినవ్ సర్దార్ ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాడు. ఆగస్ట్ 4న థియేటర్లో రిలీజ్ అయిన మిస్టేక్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ సినిమా మంచి ఫలితాలను అందుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి (సన్నీ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. ASP బ్యానర్ మీద రిలీజ్ అయిన ఈ సినిమా ఆహాలో రిలీజ్ అయి అక్కడ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది.
Mehreen Pirzada: అంత కష్టపడి చేస్తే సె* క్లిప్ అంటారా.. హానీ పాప ఆవేదన
ఆహాలో ఈ మిస్టేక్ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని విజువల్స్, డైలాగ్స్, కథ కథనాలు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం మెప్పిస్తున్నాయని సినిమా యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో అభినవ్ సర్దార్ తో పాటు అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ వంటి వారు నటించారు. ఇక ఈ సినిమాకి మణి జెన్నా అందించిన పాటలు, కొట్టిన ఆర్ఆర్ శ్రీ హర్ష మంద మాటలు ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయని యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మిస్టేక్ సినిమా ఆహాలో విజయవంతంగా దూసుకుపోతోందని అన్నారు. ఇక ఆహాలో ఈమధ్య తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ మిస్టేక్ సినిమా కూడా ఆహా ప్రేక్షకులను అలరిస్తోంది.