NTV Telugu Site icon

Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

Miss Shetty Mr Polishetty

Miss Shetty Mr Polishetty

Miss Shetty Mr Polishetty To stream on Netflix: జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డే వన్‌ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా సినిమా జవాన్ థియేటర్లో ఉన్నా కూడా… ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యిందనే చెప్పాలి.

Tollywood Shootings: పబ్బులో శర్వానంద్, స్పెషల్ సెట్టులో మహేష్ బాబు..షూటింగ్ అప్డేట్లు ఇవే!

రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా ప్రతి ఏరియాకి వెళ్లి నవీన్ పోలిశెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా మంచి బుకింగ్స్ ని రాబట్టింది. తాజాగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి నుంచి ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేసింది సినిమా యూనిట్. అక్టోబర్‌ 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని అఫిషీయల్‌గా నెట్‌ఫ్లిక్స్‌ తెలపగా ఇప్పుడు దాదాపుగా అదే ప్రకటనను సినిమా యూనిట్ కూడా చేసింది. స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్‌ అదిరిపోయిందనే చెప్పాలి. పచ్చిగోళ్ళ మహేశ్ బాబు తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ మీద ప్రమోస్, వంశీ కృష్ణారెడ్డి నిర్మించారు.

Show comments