Site icon NTV Telugu

Miss. Shetty Mr. Polishetty: స్వీటీనే తన లక్ అంటున్న జాతిరత్నం

Shetty

Shetty

Miss. Shetty Mr. Polishetty: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. నిశ్శబ్దం తరువాత స్వీటీ వెండితెరపై కనిపించింది లేదు. ఇక చాలా ఏళ్ళ తరువాత స్వీటీ నటిస్తున్న చిత్రం మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో స్టార్ హీరో లిస్ట్ లోకి చేరిపోయిన నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడంతో ప్రమోషన్స్ ను కొద్దిగా లేట్ చేసిన మేకర్స్.. రీసెంట్ గా ఆగస్టు 4 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రెండో సింగిల్ కు ముహూర్తం ఖరారు చేశారు.

Bro First Single: ఆగలేకపోతున్నాం సర్.. ఆశతో.. ఆతృతతో..

లేడీ లక్ అంటూ సాగే సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి హైప్ పెంచేశారు.. నా లేడీ లక్.. నా లేడీ లక్ నీవే అంటూ స్వీటీ వెంట పడుతూ నవీన్ పాడుతున్నట్లు కనిపించాడు. అయితే ఈ సాంగ్ ను లిరికల్ వీడియో కాకుండా ఫుల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో అనుష్క .. చెఫ్ గా కనిపిస్తుండగా.. నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు రాధాన్ సంగీతం అందిస్తున్నాడు. సాంగ్ చూస్తుంటే ఈ ఏడాది చార్ట్ బస్టర్ లో నిలిచేలా ఉంది. ఇక ఈ సినిమాలో అనుష్క ఎంతో అందంగా కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో అనుష్క హిట్ అందుకొని బిజీ అవుతుందేమో చూడాలి.

Exit mobile version