NTV Telugu Site icon

Miss Shetty Mr Polishetty Trailer: పెళ్లి వద్దు.. ప్రెగ్నెంట్ కావాలి అంటున్న అనుష్క

Anushka

Anushka

Miss Shetty Mr Polishetty Trailer: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. స్వీటీ చాలా గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించబోతుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనుష్క.. చెఫ్ గా కనిపిస్తుండగా.. నవీన్.. స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు. నవీన్ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో స్వీటీ, నవీన్ జోడీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. తనకన్నా వయస్సులో పెద్ద అయిన అమ్మాయిని హీరో ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కథగా తెలుస్తోంది.

ఇంజినీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి అని అనుష్క నవీన్ ను ఇంటర్వ్యూ చేయడంతో ట్రైలర్ మొదలయ్యింది. స్టాండప్ కమెడియన్ గా నవ్వులు పూయిస్తున్న సిద్దు అనే అబ్బాయిని తన రెస్టారెంట్ లో జాయిన్ చేసుకుంటుంది చెఫ్ అన్విత. ఆమెకు పెళ్లి మీద మంచి అభిప్రాయం ఉండదు. కానీ, తనకు పిల్లలు కావాలి అనుకుంటుంది. అయితే తన మనసుకు నచ్చిన అబ్బాయితోనే పిల్లలను కనాలనుకుంటుంది. నిజాలు చెప్పి జనాలను నవ్విస్తున్న సిద్దు.. తనకు నచ్చడంతో తన ప్రపోజల్ ను అతని ముందు ఉంచుతుంది. అయితే సిద్దు.. ఆమెను మొదటినుంచి ప్రేమించడం, ఆమె తన జీవితంలో లక్ అని అనుకోవడం జరుగుతాయి. ఇక అన్విత పిల్లలు కావాలని అనుకోవడం.. దానికి పెళ్లి వద్దు అని చెప్పడంతో సిద్దు షాక్ లోకి వెళ్తాడు. అసలు అన్విత అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది. .? సిద్దు తన ప్రేమతో అనితను మారుస్తాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటివరకు వచ్చిన కథలో ఈ కథ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. నవీన్ కామెడీ.. అనుష్క అందం.. రాధన్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. మరి ఈ సినిమా అనుష్కకు, నవీన్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.

Show comments