Miss India Varanasi Manasa As Satya Bhama in AshokGalla2: అశోక్ గల్లా హీరోగా బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో లలితాంబిక ప్రొడక్షన్స్ నిర్మాణంలో #AshokGalla2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సత్య భామగా మిస్ ఇండియా మానస వారణాసిని పరిచయం చేశారు. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్లో ‘హీరో’ సినిమాతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండో సినిమా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్నారు. ఇంకా పేరు పెట్టని #AshokGalla2 సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం గమనార్హం, లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ సినిమా నిర్మిస్తుండగా కె సాగర్ సహ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు.
Jawan Trailer: ఇండియాస్ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఈజ్ బ్యాక్…
ఇక ఈ సినిమాలో అశోక్ గల్లాకు సరసన మిస్ ఇండియా 2020 మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను సత్య భామగా పరిచయం చేసింది సినిమా యూనిట్, ఇక ఈ లుక్ లో ట్రెడిషినల్ గెటప్‌లో హాఫ్ శారీలో ఆమె అందంగా కనిపిస్తుంది. అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా అతని పాత్రను పరిచయం చేస్తూ గతంలో మేకర్స్ ఒక గ్లింప్స్ విడుదల చేయగా ఆ గ్లింప్స్ అశోక్ గల్లాని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ఇక ఈ సినిమాలో అశోక్ గల్లా రగ్గడ్, మాస్ లుక్‌లో కనిపిస్తారని చెబుతున్నారు. ధమాకా, బలగం లాంటి సినిమాలకి మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోండగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తర్వలో తెలియజేస్తారని తెలుస్తోంది.