టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, తాను రచించిన ‘ది బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్’ పుస్తకాన్ని కాపీ చేసి సినిమా తీశారని ఆరోపించారు. మిరాయ్ మేకర్స్ కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు.పిటిషనర్ గిరిధర్ తన పుస్తకంలోని కథాంశం, పాత్రలు, సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని వాదిస్తున్నారు. దీంతో సినిమా డైరెక్టర్, నిర్మాతతో పాటు ఇతర సంబంధిత వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై రేపు (సోమవారం) విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read :Jr NTR Injured: ఎన్టీఆర్‌కు గాయాలు.. షాక్ లో ఫాన్స్!
సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను చూపెట్టింది. తాజాగా, ఈ చిత్రం విడుదలైన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 112.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా తెలియజేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
