Site icon NTV Telugu

Mirai : సెన్సార్ పనులు ముగించుకున్న ‘మిరాయ్’.. రన్‌టైమ్ ఎంతంటే ?

Mirai

Mirai

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘మిరాయ్’ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ సజ్జ.. ఈసారి యూనివర్సల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని, సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జ మాత్రం పరిమిత బడ్జెట్‌లో వావ్ ఫ్యాక్టర్ అనేలా విజువల్ బేస్డ్ మూవీస్‌తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా..

Also Read : Niharika : జలపాతం వద్ద..‘అమ్మా క్షమించు’ అంటూ నిహారిక వైరల్ క్లిప్..

ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. “సినిమాలోని కంటెంట్, విజువల్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి” అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 49 నిమిషాలుగా లాక్ చేశారు. ఈ నిడివి ఫాంటసీ, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేస్తుందన్న నమ్మకం టీమ్‌లో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో మనోజ్ మాంచు, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గౌరహరి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. మరి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ‘మిరాయ్’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version