Site icon NTV Telugu

Minister Roja: మెగాస్టార్ తో ఫైర్ బ్రాండ్.. సంతోషంగా ఉందంటూ ట్వీట్

Roja

Roja

మినిస్టర్ రోజా సెల్వమణి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి చిరు కుటుంబాన్ని పలకరించారు. మంత్రి రోజాను, చిరు కుటుంబం సాదరంగా ఆహ్వానించింది.  అనంతరం ఆమె మంత్రి పదవి అందుకున్నందుకు చిరు , రోజా దంపతులను సన్మానించారు. కొద్దిసేపు ఇరు కుటుంబాలు ముచ్చటించుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ రోజా, చిరుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

“కుటుంబ సమేతంగా చిరంజీవిగారిని కలవడం చాలా సంతోషాన్నిచ్చింది. సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్యూ చిరంజీవి గారు” అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక రోజా కూతురు, కొడుకును చిరు మెచ్చుకున్నారని, త్వరలోనే రోజాకు మరింత పేరు తేవాలని ఆకాంక్షించారని సమాచారం.

Exit mobile version