NTV Telugu Site icon

Dil Raju: ‘బలగం’ చూపిస్తున్న దిల్ రాజు, ఒకే ఈవెంట్ కి ఇద్దరు గెస్టులు…

Dil Raju

Dil Raju

ప్రియదర్శి హీరోగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా ‘టిల్లు వేణు’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బలగం’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ లెవల్లో చేస్తున్నారు. ఒక చిన్న సినిమాకి కలలో కూడా ఊహించని రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్న దిల్ రాజు, ఈరోజు సాయంత్రం జరగనున్న ‘బలగం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా హీరో సిద్ధూ జొన్నలగడ్డని, మినిస్టర్ కేటీఆర్ ని ఇన్వైట్ చేశాడు. ‘సిరిసిల్ల’లోని బతుకమ్మ ఘాట్ లో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన బలగం మూవీ మార్చ్ 3న ఆడియన్స్ ముందుకి రానుంది. టీజర్, ట్రైలర్, ఊరు పల్లెటూరు సాంగ్… ఇలా ప్రమోషనల్ కంటెంట్ తో ఒక సినిమాని చూడబోతున్నాం అనే నమ్మకాన్ని కలిగించడంలో దిల్ రాజు అండ్ టీం సక్సస్ అయ్యారు. బలగం సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు, దిల్ రాజు మైంటైన్ చేసే థియేటర్స్ కి బలగం సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది.

Read Also: Ajay Bhupathi: ‘మంగళవారం’ ఏం జరిగింది?